పార్టీకి కొలికపూడి వార్నింగ్.. ఇలా చేస్తే రాజీనామా చేస్తా
తిరువూరు కూటమి పార్టీల్లో విభేదాలు మరింత ముదిరాయి. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుకు, టీడీపీ నేతలకు మధ్య పొసగడం లేదు;

తిరువూరు కూటమి పార్టీల్లో విభేదాలు మరింత ముదిరాయి. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుకు, టీడీపీ నేతలకు మధ్య పొసగడం లేదు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. కొలికపూడి విజయానికి తామే కారణమని టీడీపీ నేతలు, కార్యకర్తలు అంటుంటే తన గెలుపునకు ఎన్నో కారణాలున్నాయని కొలికపూడి శ్రీనివాసరావు అన్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుపై అనేక వివాదాలు చుట్టుముట్టాయి. పార్టీ క్రమశిక్షణ ఎదుట కూడా హాజరయ్యారు. టీడీపీకి కూడా కొలికపూడి తరచూ వివాదాల్లో తలదూర్చడం తలనొప్పిగా మారింది.
రమేష్ రెడ్డిని పార్టీ నుంచి....
ఇటీవల సంచలనమైన ఒక మహిళపై లైంగిక వేధింపుల ఆడియో వైరల్ గా మారింది. దీంతో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఇంటి ఎదుట గిరిజన మహిళలు నిరసన వ్యక్తం చేశారు. టీడీపీకి చెందిన తిరువూరు మాజీ ఏఎంసీ ఛైర్మన్ ఆలవాల రమేష్ రెడ్డిని పార్టీ నుండి తక్షణమే బహిష్కరించాలి నినాదాలతో వారు హోరెత్తించారు. తమకు న్యాయం చేయాలని గిరిజన తండాల మహిళలు ఆందోళనకు దిగడంతో పోలీసులు భారీగా మొహరించారు. అక్కడ నుంచి వెళ్లిపోవాలని పోలీసులు గిరిజన మహిళలను ఆదేశించారు.
పార్టీ అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్లినా...
అయితే పార్టీ అధిష్టానం దృష్టికి రమేష్ రెడ్డి వ్యవహారాన్ని పది రోజుల క్రితమే తీసుకెళ్ళానని ఎంఎల్ఏ కోలికపూడి శ్రీనివాసరావు తెలిపారు. ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, వారికైతే ఒక న్యాయం మరొకరికి అయితే ఇంకో న్యాయమా అంటూ ఆయన ప్రశ్నిచడం కూడా మరోసారి వివాదంగా మారే అవకాశాలున్నాయి. రమేష్ రెడ్డి విజయవాడ ఎంపీ కార్యాలయంలో మూల్పురి కిషోర్ అనే వ్యక్తికి తనని కాపాడాలని నాలుటు ట్రాక్టర్లు,50 లక్షలు డబ్బులు ఇచ్చాడాని తన దృష్టికి వచ్చిందని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఆరోపించారు. కానీ విచారణ జరిపితే ఒక ట్రాక్టర్ ఇచ్చాడని తన వ్యక్తిగత విచారణలో తెలిందని ఎంఎల్ఏ కొలికపూడి శ్రీనివాసరావు తెలిపారు.
ఎంపీ కార్యాలయంపైన కూడా...
దీంతో ఎంపీ కార్యాలయంపై ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు నేరుగా ఆరోపణలు చేసినట్లయింది. కానీ ఎంపీ కేశినేని శివనాథ్ కు ఇలాంటివి ఒప్పుకోరని, ఆయనకి తెలియకుండానే ఇదంత జరుగుతుందని కొలికపూడి చెప్పినప్పటికీ ఆరోపణలనే హైలెట్ చేస్తూ మరోసారి పార్టీ నాయకత్వానికి ఫిర్యాదు చేశారు. తన గురించి తప్పుడు ప్రచారం చేస్తున్న వారికి ఒకటే చాలెంజ్ అన్న కొలికపూడి తిరువూరులో ఎక్కడైనా పబ్లిక్ డిబేట్ పెట్టండి వస్తానని తేదీ, సమయం చెప్పండి అంటూ ఎమ్మెల్యే సవాల్ విసిరారు. మొన్న మూడు గ్రావెల్ లారీలు పట్టుకున్నారని కేసులు నమోదు చేశారిన, మరి దాని వెనకున్న నాయకుల పేర్లు ఎందుకు వెల్లడించలేదని, మరో 97లారీలు ఎందుకు వదిలేసారని కొలికపూడి ప్రశ్నించారు. బాధితులకు న్యాయం జరగపోతే ఎమ్మెల్యేగా తాను ఎందుకు ఉండాలని కొలికపూడి ప్రశ్నించారు. పార్టీ దృష్టిలో ఈ విషయాలన్నీ పెట్టానని, క్రమశిక్షణ కమిటీకి చెప్పానన్న ఓపికపట్టాలని కోరారు. రమేష్ డ్డి పై పార్టీ నాయకత్వం చర్యలు తీసుకోకపోతే 48 గంటల్లో నేను రాజీనామా చేస్తానంటూ ఎంఎల్ఏ కోలికపూడి శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.