రామకుప్పం ఎంపీపీ పదవి కోసం మొహరించిన ఇరు వర్గాలు
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో రామ కుప్పం ఎన్నికను వైసీపీ, టీడీపీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.;

చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో రామ కుప్పం ఎన్నికను వైసీపీ, టీడీపీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈరోజు రామకుప్పం ఎంపీపీ ఎన్నిక జరగనుండటంతో ఇరు పార్టీలు తమకు చెందిన ఎంపీటీసీలను క్యాంప్ లకు తరలించారు. రామకుప్పం మండలంలో మొత్తం ఎనిమిది మంది వైసీపీకి, ఏడుగురు టీడీపీకి ఎంపీపీలున్నారు. అయితే ఈ ఎన్నికల్లో గెలిచేందుకు వైసీపీ, టీడీపీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.
రెండు పార్టీలూ....
ఆధిపత్యం కోసం ఎంపీటీసీలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఎంపీపీ ఎన్నికలను అడ్డుకోవాలని వైసీపీ చూస్తుంది. ఇద్దరు వైసీపీ సభ్యులు టీడీపీకి మద్దతు ఇస్తారని తెలియడంతో ఎన్నికను నిలిపి వేయించే ప్రయత్నాలు మొదలుపెట్టింది. అయితే ఎన్నికను జరపాలని టీడీపీ పట్టుబడుతుంది. దీంతో రామకుప్పం ప్రాంతంలో పోలీసులు 144వ సెక్షన్ తో పాటు యాక్ట్ 30ని విధించారు. గురువారం ఉదయం నుంచి పోలీసులు భారీగా మొహరించారు.