40వేల రూపాయల ఇంజెక్షన్ ఫ్రీ.. ఏపీ ప్రభుత్వం గొప్ప ఆలోచన
ఐసీఎంఆర్ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం స్టెమి (STEMI) కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టుగా
ఇటీవలి కాలంలో గుండె సంబంధిత రోగాలు ప్రజలను ఎంతగానో ఇబ్బందిపెడుతూ ఉన్నాయి. చిన్న వయసులో ఉన్న వాళ్లు కూడా హార్ట్ అటాక్ కారణంగా మరణిస్తూ ఉండడం ఆందోళనకరంగా మారింది. గుండె సంబంధిత వ్యాధులపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. గుండెపోటు వచ్చిన వారికి మొదటి గంటలోనే అత్యవసర ప్రాథమిక చికిత్సను అందించడం ద్వారా ప్రాణాలు నిలబెట్టే స్టెమి ప్రాజెక్టుకు వైద్య ఆరోగ్య శాఖ శ్రీకారం చుట్టింది. గుండెపోటు సంభవించిన తొలి గంట చాలా కీలకమని.. దీనిని గోల్డెన్ అవర్ అంటారు. ఈ గోల్డెన్ అవర్‌లో చికిత్స అందించడం ద్వారా రోగి ప్రాణాలు నిలబెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గుండెపోటు కారణంగా జరిగే మరణాలను తగ్గించేందుకు ఐసీఎంఆర్ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం స్టెమి (STEMI) కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించనుంది. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనుంది.