లిక్కర్ విషయంలో ఏపీ సర్కార్ సీరియస్

మద్యం షాపుల్లో ఎమ్మార్పీ ఉల్లంఘనలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్‌ అయ్యింది

Update: 2024-12-03 02:18 GMT

మద్యం షాపుల్లో ఎమ్మార్పీ ఉల్లంఘనలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్‌ అయ్యింది. ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు లిక్కర్‌ అమ్మే షాపులపై చర్యలకు రంగం సిద్ధమయింది. ఎమ్మార్పీ ఉల్లంఘనలకు పాల్పడితే ఐదు లక్షల రూపాయల జరిమానా విధిస్తామని హెచ్చరించింది. రెండోసారి కూడా అదే జరిగితే సదరు బార్ లేదా లిక్కర్ షాపు లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించింది.

షాపు యజమానులు కూడా...
మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో మద్యం దుకాణదారులు కూడా ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. టెండర్ల విషయంలో ప్రభుత్వం చెల్లిస్తామన్న కమిషన్ ను చెల్లించాలని వారు కోరుతున్నారు. లేకుంటే తాముు లైసెన్సు ఫీజు కూడా కట్టేందుకు సిద్ధంగా లేమని తెలిపారు. కడప జిల్లాలో జరిగిన మద్యం వ్యాపారుల సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.


Tags:    

Similar News