Breaking : ఆ రెండు పథకాలకు పేర్లు మార్చిన ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివిధ పథకాలకు పేర్లు మార్చింది. జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పేర్లను మార్చింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివిధ పథకాలకు పేర్లు మార్చింది. జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పేర్లను మార్చింది. ఆ పేర్ల స్థానంలో పోస్టు మెట్రిక్ స్కాలర్ షిప్ గా పేరుగా మార్చారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వం విద్యార్థుల కోసం ఇచ్చే ప్రయోజనాలకు జగన్ తన పేర్లను పెట్టుకున్నారు. జగనన్న విదేశీ విద్యాదీవెన పథకాన్ని అంబేద్కర్ ఓవర్ సీస్ పధకంగా మార్చింది. వైఎస్సార్ కల్యాణ మస్తు పథకాన్ని చంద్ర పెళ్లికానుకగా మార్చింది.
మిగిలిన వాటికి కూడా...
అయితే కొత్త ప్రభుత్వం ఈ రెండు స్కీమ్ లను కొనసాగించాలని నిర్ణయించుకోవడంతో ఆ పేర్లను మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఈరెండు పథకాలకు సంబంధించి పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్ గా నామకరణం చేశారు. వైఎస్సార్ విద్యోన్నతి పథకాన్ని ఎన్టీఆర్ విద్యోన్నతి పథకంగా మార్చింది. మరికొన్ని పథకాల పేర్లను కూడా మార్చాలని కొత్త ప్రభుత్వం నిర్ణయించింది.