Andhra Pradesh : ఏపీలో పింఛను దారులకు గుడ్ న్యూస్ ఈనెల కూడా?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛనుదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఒకరోజు ముందుగానే ఈ నెల పింఛను ను ఇవ్వనుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛనుదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఒకరోజు ముందుగానే ఈ నెల పింఛను ను ఇవ్వనుంది. జనవరి 1వ తేదీన ఇవ్వాల్సిన పింఛనును డిసెంబరు 31వ తేదీనే ఇవ్వాలని నిర్ణయించింది. పింఛను మొత్తానికి సంబంధించిన నిధులను ఈ నెల 30వ తేదీన బ్యాంకులో జమ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
డిసెంబరు 31వ తేదీన...
ఈనెల 31వ తేదీన చంద్రబాబు పల్నాడు జిల్లాలో పర్యటిస్తారు. నరసరావుపేటలో జరిగే పింఛను పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. నూతన సంవత్సర వేడుకలు జనవరి ఒకటో తేదీన జరుపుకోవాల్సి ఉన్నందున డిసెంబరు 31వ తేదీన ఇవ్వాలని నిర్ణయించింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ప్రతి నెల ఒకటో తేదీన పింఛను మొత్తాన్ని అందిస్తూ ఉన్న సంగతి తెలిసిందే.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now