Andhra Pradesh : ఇంటర్ విద్యార్థులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్
ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇంటర్ విద్యను అభ్యసిస్తున్న వారికి మధ్యాహ్న భోజనం పెట్టాలన్న దానిపై నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకూ ప్రాధమిక విద్యకు మాత్రమే పరిమితమైన మధ్యాహ్న భోజనాన్ని ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా పెట్టాలని నిర్ణయించింది. అయితే దీనికి సంబంధించిన అధికారిక నిర్ణయం మాత్రం వెలువడలేదు.
వచ్చే విద్యాసంవత్సరం నుంచి...
వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్నభోజనం అందించే కార్యక్రమంపై విద్యాశాఖ ఉన్నతాధికారులతో మంత్రి నారా లోకేష్ ఇప్పటికే చర్చించారు. దీనిపై త్వరలో వెలువడే అవకాశముంది. అదే సమయంలో రానున్న 6 నెలలకు విద్యాశాఖ రూట్ మ్యాప్ ను కూడా రూపొందించుకుంది. 'ఒక పాఠశాల-ఒక యాప్ పేరుతో సమగ్ర డాష్ బోర్డ్ ను రూపొందించింది. ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు కొత్త యూనిఫామ్‌లు ఇవ్వాలని నిర్ణయించింది.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now