ఏపీకి అవార్డుల పంట

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అవార్డుల పంట పండింది. జాతీయ స్థాయిలో పది అవార్డులను ఆంధ్రప్రదేశ్ సొంతం చేసుకుంది.;

Update: 2022-01-07 04:05 GMT
andhra praesh, skotch, awarda, welfare schemes
  • whatsapp icon

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అవార్డుల పంట పండింది. జాతీయ స్థాయిలో పది అవార్డులను ఆంధ్రప్రదేశ్ సొంతం చేసుకుంది. ప్రతి ఏటా స్కోచ్ గ్రూపు ఈ అవార్డులను ప్రకటిస్తుంది. వివిధ రాష్ట్రాల నుంచి దేశ వ్యాప్తంగా 113 నామినేషన్లు రాగా అందులో పది అవార్డులు ఏపీకి దక్కాయి. ఐదు గోల్ట్, ఐదు సిల్వర్ స్కోచ్ అవార్డులు ఆంధ్రప్రదేశ్ కు లభించాయి.

సంక్షేమ పథకాలకు....
ప్రధానంగా ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలకు ఈ అవార్డులు దక్కాయి. వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా, నేతన్న నేస్తం పథకాలకు అవార్డుల దక్కాయి. ఫిష్ ఆంధ్ర, గిరిజన ప్రాంతాల్లో పౌష్టికాహారాన్ని అందజేస్తున్న విజయనగరం జిల్లాకు కూడా అవార్డులు దక్కాయి. వర్చువల్ విధానంలో స్కోచ్ గ్రూపు ఎండీ గురుశరణ్ దంజల్ ఈ అవార్డులను అందజేశారు.


Tags:    

Similar News