Ap Cabinet : నేడు ఏపీ కేబినెట్ సమావేశం... కీలక నిర్ణయాల దిశగా?
నేడు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు;

నేడు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఉదయం పదకొండు గంటలకు సచివాలయంలో ప్రారంభమయ్యే ఈ సమావేశంలో పలు సంస్థలకు భూకేటాయింపులు జరిపే విషయంపై చర్చించి మంత్రివర్గం ఆమోదించనుంది.
రెండు పథకాలకు...
దీంతోపాటు రాజధాని అమరావతి పనులకు సంబంధించిన పనులకు కూడా కేబినెట్ లో ఆమోదం తెలపనుంది. ఈ కేబినెట్ లో తల్లికి వందనం, అన్నదాతసుఖీభవ పథకానికి సంబంధించి అమలు తేదీలపై నిర్ణయం తీసుకోనున్నారని తెలిసింది. వీటితో పాటు నాలా చట్టం రద్దుకు సంబంధించి కూడా కేబినెట్ లో తీర్మానం చేసే అవకాశముంది. ఇక అమరావతిలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు సంబంధించి కూడా చర్చించనున్నారు.