రాయలసీమ రైతులకు గుడ్ న్యూస్
. ఇప్పటికే హంద్రీనీవా పనులు శరవేగంతో పూర్తవు;

హంద్రీనీవా ప్రాజెక్టు పనులను 2025 జూన్ నాటికి పూర్తి చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే హంద్రీనీవా పనులు శరవేగంతో పూర్తవుతున్నాయని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. హంద్రీనీవా ప్రాజెక్టు మొదటి దశ పనులు 2025 జూన్ నాటికి పూర్తి చేయాలని చంద్రబాబు నాయుడు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఆ ఆదేశాల మేరకు ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయని నిమ్మల తెలిపారు.
మొదటిదశ పనులు...
రాయలసీమకు కృష్ణా, గోదావరి నదుల జలాలు అందించడం చంద్రబాబు నాయుడు ప్రధాన లక్ష్యమని మంత్రి అన్నారు. ప్రాజెక్టు పూర్తి కాగానే రాయలసీమ ప్రాంతంలో నీటి సమస్యలు పూర్ణంగా పరిష్కారమవుతాయని, సాగు, తాగునీటి అవసరాలు తీరుతాయని మంత్రి నిమ్మల రామానాయుడు విశ్వాసం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం తగినంత నిధులు కేటాయించకపోవడం వల్లనే ప్రాజెక్టు ఆలస్యమవుతోందని విమర్శించారు.