రేపు ఢిల్లీకి నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ రేపు ఢిల్లీ బయలుదేరి వెళుతున్నారు.;

Update: 2025-02-03 13:55 GMT
nara lokesh, minister, tomorrow, delhi
  • whatsapp icon

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ రేపు ఢిల్లీ బయలుదేరి వెళుతున్నారు. రేపు సాయంత్రం కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తో ఆయన సమావేశం కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ ప్రాజెక్టుల గురించి అశ్వినీ వైష్ణవ్ తో చర్చించనున్నారు. రైల్వే బడ్జెట్ లో ఏపీకి భారీగానే నిధులు కేటాయించిన నేపథ్యంలో లోకేష్ ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది.

మరికొందరు కేంద్ర మంత్రులతో...
లోకేష్ రేపు రైల్వే మంత్రితో పాటు మరికొందరు కేంద్రమంత్రులను కూడా కలిసే అవకాశముందని తెలిసింది. రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు, నిధుల గురించి ాయన ఈ సమావేశాల్లో ప్రస్తావించనున్నారు. ఇందుకోసం కేంద్ర మంత్రుల అపాయింట్ మెంట్ ను కూడా టీడీపీ ఎంపీలు ముందుగానే తీసుకున్నట్లు సమాచారం. పలు విషయాలపై ఆయన చర్చలు జరిపే ఛాన్స్ ఉంది.


Tags:    

Similar News