వరద నష్టం వేల కోట్లలో... సాయం అందిచే వారే లేరా?
ఆంధ్రప్రదేశ్ కు వరదలతో తీవ్ర నష్టం జరిగింది. పక్కా ఇళ్లు సయితం నేలమట్టమయ్యాయి. ప్రాజెక్టులు తెగిపోయాయి.
ఆంధ్రప్రదేశ్ కు వరదలతో తీవ్ర నష్టం జరిగింది. పక్కా ఇళ్లు సయితం నేలమట్టమయ్యాయి. ప్రాజెక్టులు తెగిపోయాయి. కల్వర్టులు కూలిపోయాయి. ప్రభుత్వ ఆస్తులకు వేల కోట్లలో నష్టం జరిగింది. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇక పంటనష్టం గురించి చెప్పాల్సిన పనిలేదు. ఈ సమయంలో బాధితులకు, ప్రభుత్వానికి అండగా నిలవాల్సిన స్వచ్ఛంద సంస్థలు ముందుకు రాకపోవడం చర్చనీయాంశంగా మారింది.
బాబు హయాంలో....
చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఈనాడు వంటి సంస్థలు ముందుకు వచ్చి విరాళాలు సేకరించి బాధితులకు అండగా నిలిచేవి. కేరళ వంటి రాష్ట్రాల్లో వరదలు సంభవించినప్పుడు అక్కడ పక్కా ఇళ్లు నిర్మించిన ఘనత ఆ సంస్థది. రాజధాని అమరావతి నిర్మాణానికి విరాళాలు సేకరించిన మరో సంస్థ ఇప్పుడు కిమ్మనడం లేదు. బాధితులను ఆదుకోవాలన్న ఉద్దేశ్యమే లేదు. అదే సమయంలో ఇతర స్వచ్ఛంద సేవలు కూడా ముందుకు వచ్చి సహకారం అందించేవి. ప్రభుత్వ సాయానికి తోడు స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు వస్తే బాధితులకు కొంత ఊరట లభించేది. కానీ నేడు జగన్ హాయంలో ఏ సంస్థ సేవలందించేందుకు ముందుకు రాకపోవడం చర్చనీయాంశంగా మారింది.