ఏపీలో ఉల్లిగడ్డ.. ఆలు గడ్డ రచ్చ

తిరుపతి జిల్లాలో మిగ్ జాం తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్

Update: 2023-12-09 03:11 GMT

తిరుపతి జిల్లాలో మిగ్ జాం తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటించారు. ఈ సందర్భంగా వాకాడు మండలం బాలిరెడ్డిపల్లెలో వరద బాధితులతో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం జగన్ మాట్లాడుతూ.. పొటాటో అంటే ఉల్లిగడ్డే తడబడ్డారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో 92 రిలీఫ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని, 8 వేలకు పైగా బాధితులను అక్కడకు తరలించామన్నారు. దాదాపు 60వేల మందికి ఉచిత రేషన్ ఇస్తున్నామని, 25 కేజీల బియ్యం, కందిపప్పు, పామాయిల్, కిలో ఆనియన్, బంగాళాదుంపలు ఇస్తున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో పొటాటోను ఉల్లిగడ్డ అనే అంటారు కదా? అని పక్కనున్న వారిని అడిగారు. పొటాటో అంటే ఆలుగడ్డ.... కానీ ఆయన ఉల్లిగడ్డ అంటారు కదా.. అని ప్రశ్నించారు. పక్కనున్న వారు బంగాళాదుంప అని చెప్పగా.. సీఎం జగన్ నవ్వుకుంటూ, 'ఆ.. బంగాళాదుంప' అన్నారు.

ఈ విషయాన్ని టీడీపీ టార్గెట్ చేసింది. మిచౌంగ్ తుఫానుతో పంటలను నష్టపోయిన రైతులు ఓ వైపు కన్నీళ్లు పెడుతుంటే సీఎం జగన్ మోహన్ రెడ్డి బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం సిగ్గుచేటని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం అమృతలూరులో మిచౌంగ్ తుపానుతో నష్టపోయిన పంటపొలాలను పరిశీలించిన చంద్రబాబు రైతులతో మాట్లాడారు. సీఎం జగన్‌కు బంగాళ దుంపలకు, ఉల్లిగడ్డలకు తేడా తెలియడం లేదని.. ఇలాంటి వ్యక్తికి ప్రజల కష్టాలు ఎలా తెలుస్తాయని ఎద్దేవా చేశారు. వైసీపీ నేతల మాటలు కోటలు దాటుతాయి కానీ.. చేతలు గడపకూడా దాటవని ఎద్దేవా చేశారు. వైసీపీ చేతకాని పాలనతో ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని మండిపడ్డారు.



Tags:    

Similar News