అలర్ట్.. జూన్ 2 నుంచి టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు

టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,12,221 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. పరీక్షల..;

Update: 2023-05-31 07:23 GMT
ap 10th supply exams

ap 10th supply exams

  • whatsapp icon

ఏపీ పదో తరగతి ఫెయిల్ అయిన విద్యార్థులకు జూన్ 2వ తేదీ నుంచి అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. జూన్ 2 నుంచి 10వ తేదీ వరకూ పరీక్షలు జరగనున్నట్లు ఎస్ఎస్సీ పరీక్షల విభాగం సంచాలకులు దేవానందరెడ్డి మంగళవారం తెలిపారు. టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,12,221 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. పరీక్షల నిర్వహణకు 915 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు జరుగుతాయని, విద్యార్థులు 8.45 గంటల నుంచి 9.30 గంటల లోగా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని తెలిపారు. ఆలస్యంగా వచ్చినవారిని పరీక్ష కేంద్రంలోకి అనుమతించబోమని స్పష్టం చేశారు.

టెన్త్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు 915 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, మరో 915 మంది డిపార్ట్ మెంట్ ఆఫీసర్లు, 11 వేల మంది ఇన్విజిలేటర్లు, 86 ఆకస్మిక తనిఖీ బృందాలను నియమించినట్లు పేర్కొన్నారు. సెల్ఫోన్లు, ల్యాప్ టాప్ లు, ట్యాబ్ లు, కెమెరాలు, ఇయర్ ఫోన్లు, స్పీకర్లు, స్మార్ట్ వాచ్ లు, బ్లూటూత్.. ఇలా తదితర ఎలక్ట్రానిక్ కేంద్రాలను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించేది లేదన్నారు. జూన్‌ 13, 14 తేదీల్లో రాష్ట్రంలోని 23 కేంద్రాల్లో సప్లిమెంటరీ పరీక్షల మూల్యాంకనం జరుగుతుందని తెలిపారు. పరీక్షలకు సంబంధించి ఏవైనా అనుమానాలుంటే.. 0866-2974540 ఫోన్ నంబర్ సంప్రదించవచ్చని తెలిపారు.


Tags:    

Similar News