Andhra Pradesh : ఏపీలో రేపు సెలవు లేదు... కార్యాలయాలు పనిచేస్తాయి
ఆంధ్రప్రదేశ్ లో రేపు రెండో శనివారమయినా రిజిస్ట్రేషన్ కార్యాలయాలు పనిచేయాలని ప్రభుత్వం ఆదేశించింది;

ఆంధ్రప్రదేశ్ లో రేపు రెండో శనివారమయినా రిజిస్ట్రేషన్ కార్యాలయాలు పనిచేయాలని ప్రభుత్వం ఆదేశించింది. రెండో శనివారమయినా సెలవు తీసుకోకుండా పనిచేయాలని సూచించింది. రెండో శనివారం సాధారణంగా సెలవు దినం కావడంతో రేపు రిజిస్ట్రేషన్ కార్యాలయాలు పనిచేయవని భావించే వారికి ప్రభుత్వం ఈ కబురు చెప్పింది.
ఆదాయం పెంచుకునేందుకు...
ప్రభుత్వం తన ఆదాయాన్ని పెంచుకునేందుకు రిజిస్ట్రేషన్ కార్యాలయాలు సెలవు దినాల్లో కూడా పనిచేయాలని సూచించింది. దీంతో రేపు ఏపీ అంతటా రిజిస్ట్రేషన్ కార్యాలయాలు పనిచేయనున్నాయి. భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్లు రేపు పెద్దయెత్తున జరిగే అవకాశముందని, మంచిరోజు కావడంతో రేపు పనిచేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.