Andhra Pradesh : నామినేటెడ్ పోస్టులు భర్తీ పూర్తి.. ఇరవై పోస్టులను ప్రకటించిన ఏపీ సర్కార్

నామినేటెడ్ పోస్టులను ఏపీ ప్రభుత్వం భర్తీ చేసింది. గత కొద్ది రోజులుగా ఊరిస్తున్న పదవులను భర్తీ చేస్తూ నిర్ణయం తీసుకుంది.

Update: 2024-09-24 07:30 GMT

నామినేటెడ్ పోస్టులను భర్తీని ఏపీ ప్రభుత్వం చేపట్టింది. గత కొద్ది రోజులుగా ఊరిస్తున్న పదవులను భర్తీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇరవై నామినేటెడ్ పోస్టులను ఇప్పటివరకూ భర్తీ చేసింది. ఆర్టీసీ ఛైర్మన్ గా కొనకళ్ల నారాయణను నియమించింది. వక్ఫ్ బోర్డు ఛైర్మన్ గా అబ్దుల్ అజీజ్, ట్రైకార్ ఛైర్మన్ గా శ్రీనివాసులు, ఏపీఐఐసీ ఛైర్మన్ గా మంతెన రామరాజు, 20 సూత్రాల అమలు కమిటీ ఛైర్మన్ గా లంకా దినకర్, ఏపీ టూరిజం ఛైర్మన్ గా నూకసాని బాలాజీని నియమించింది. టిడ్కో ఛైర్మన్ గా జనసేనక్ుకేటాయించింది. శాప్ ఛైర్మన్ గా రవినాయుడును నియమించింది. మొత్తం ఇరవై పోస్టులలో పదహారింటిలో టీడీపీ నేతలను నియమించింది. మూడు జనసేనకు ఇచ్చింది. ఒకటి బీజేపీకి కేటాయించింది. మిగిలిన పోస్టులను కూడా త్వరలోనే భర్తీ చేస్తామని సర్కార్ చెబుతుంది. పీతల సుజాత, పీలా గోవింద్ వంటి టిక్కెట్లు కోల్పోయిన వారికి కూడా నామినేటెడ్ పదవులు లభించాయి.

వంద రోజులు కావస్తుండటంతో
ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు దాటి పోయింది. అయితే ఇంత వరకూ నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయకపోవడంపై తెలుగు తమ్ముళ్లు కొంత అసహనంగా ఉన్నట్లు కనపడుతుంది. సమయం గడచిపోతున్నా తమకు పదవీ యోగం ఎప్పుడనేది వారికి అర్థం కాకుండా ఉంది. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నామినేటెడ్ పోస్టులపై ఇప్పటికే కసరత్తులు పూర్తి చేశారన్న వార్తలతో ఎప్పుడు ఫస్ట్ లిస్ట్ ను విడుదల చేస్తారన్న దానిపై పార్టీలో ఆసక్తి నెలకొంది. అనేక మంది పదవులు లేక, వస్తాయో లేదో తెలియక టెన్షన్ పడి పోతున్నారు. అనేక కారణాలతో మళ్లీ మన పేర్లు వెనక్కు వెళతాయేమోనన్న బెంగ తెలుగు తమ్ముళ్లలో పట్టుకుంది.
నామినేటెడ్ పోస్టులను...
ఆంధ్రప్రదేశ్ లో అనేక కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమించాల్సి ఉంది. దీంతో పాటు నామినేటెడ్ పోస్టులను అనేకం భర్తీ చేయాల్సి ఉంది. నెల రోజుల క్రితమే దీనికి సంబంధించిన ప్రక్రియను చంద్రబాబు ప్రారంభించారు. హైదరాబాద్ లో కూర్చుని లిస్ట్‌ను ప్రిపేర్ చేశారన్న వార్తలు కూడా చాలా రోజుల క్రితమే వచ్చాయి. ఇక లిస్ట్ విడుదల కావడమే ఆలస్యం అనుకున్న తరుణంలో విజయవాడను వరదలు ముంచెత్తాయి. దీంతో చంద్రబాబు నాయుడు వరద సహాయక చర్యలపై ఫోకస్ పెట్టాల్సి వచ్చింది. దీంతో నామినేటెడ్ పోస్టుల భర్తీ కార్యక్రమాన్ని చంద్రబాబు వాయిదా వేశారు. వరదల నుంచిబయటపడి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు.
మిత్రపక్షాల నుంచి...
అయితే చంద్రబాబు మిత్రపక్షాలైన జనసేన, బీజేపీలకు కూడా నామినేటెడ్ పోస్టులను ఇవ్వాల్సి ఉంటుంది. వారికి ఎలాంటి పోస్టులు ఇవ్వాలి? అప్రధాన్య పోస్టులు ఇస్తే వారు ఊరుకోరు. బీజేపీ ఇప్పటికే దుర్గగుడి ఛైర్మన్ పదవిని కోరిందన్న వార్తలు వస్తున్నాయి. కానీ విజయవాడ వంటి ముఖ్యమైన ప్రాంతమైన చోట పట్టు కోల్పోయేందుకు చంద్రబాబు ఇష్టపడటం లేదు. మరోవైపు అదే సమయంలో విజయవాడ పశ్చి మ నియోజకవర్గం నుంచి బీజేపీ తరుపున గెలిచిన సుజనా చౌదరి కూడా తన అనుచరుల్లో ఒకరికి అంటే బీజేపీ నేతకు దుర్గగుడి ఛైర్మన్ పదవి కావాలని పట్టుబటడటంతో పీటముడి పట్టినట్లు చెబుతున్నారు. కానీ సుజనా చౌదరి సన్నిహితుడు లంకా దినకర్ కు ప్రస్తుతం వేరే నామినేటెడ్ పదవిఇచ్చింది.
తీవ్ర వత్తిళ్ల మధ్య...
దీంతో పాటు బీజేపీ నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులుగా బీజేపీ పలువురు పేర్లను సిఫార్సు చేయడంతో పాటు కేంద్ర మంత్రుల నుంచి కొన్ని పేర్లు రావడంతో చంద్రబాబుకు నామినేటెడ్ పోస్టుల భర్తీ తలనొప్పిగా మారింది. అంతా సిద్ధమయిన పరిస్థితుల్లో తీవ్రమైన ఒత్తిళ్లు మిత్రపక్షమైన బీజేపీ నుంచి రావడం వల్లనే జాబితాను కొంత వాయిదా వేసినట్లు పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. అయితే పార్టీ కోసం కష‌టపడిన వారికి అన్యాయం చేయడం ఇష్టం లేని చంద్రబాబు బీజేపీ నేతలను ఒప్పించి, మెప్పించి నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియను త్వరలోనే పూర్తి చేస్తారన్న వార్తలు వస్తున్నాయి. త్వరలోనే మిగిలిన పోస్టులను కూడా భర్తీ చేసే అవకాశముంది.


Tags:    

Similar News