ఏబీకి ఏపీ సర్కార్ క్లీన్ చిట్
సీనియర్ మాజీ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు కు ప్రభుత్వం క్లీన్ చీట్ ఇచ్చింది
సీనియర్ మాజీ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు కు ప్రభుత్వం క్లీన్ చీట్ ఇచ్చింది. చట్టాన్ని పూర్తిగా తమ చేతుల్లోకి తీసుకుని , చట్టాన్ని అతిక్రమించిసమర్ధుడైన అధికారిగా పేరు తెచ్చుకున్న ఏపీ వెంకటేశ్వరరావు పై వైసీపీ ప్రభుత్వ హయాంలో కుట్రపూరితంగానే అభియోగాలు మోపిందని తేల్చారు.అప్పటి వైసీపీ ప్రభుత్వం తమకు అనుకూలమైన ఐఏఎస్ అధికారి తో నివేదిక రూపొందించుకోవడంతో పాటు ఆ నివేదికలో ఆ ఐఏఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు పై తప్పుడు నివేదికలు ఇవ్వడం పై కూడా ప్రభుత్వం విచారణ జరిపింది.
అధికారంలోకి వచ్చిన తర్వాత...
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎట్టకేలకు ఏ బి వెంకటేశ్వరరావు పై మోపబడిన అభియోగాలు అవాస్తవమని చట్టాన్ని అతిక్రమించి నివేదికలు ఇచ్చిన ఐఏఎస్ అధికారి గురించి అనేక వివరాలు బయటకు వచ్చాయని ప్రభుత్వం తెలిపింది. ఏబీ వెంకటేశ్వరరావు పై మోపిన అభియోగాలు అవాస్తవమని తాజాగా ప్రభుత్వం తేల్చి చెప్పడంతో ఏబీకి క్లీన్ చిట్ ఇచ్చినట్లయింది. విజయవాడ పోలీస్ కమిషనర్ గా రెండు పర్యాయాలు ఏ బి వెంకటేశ్వరరావు పనిచేశారు. ఏబీ వెంకటేశ్వరరావు హయాంలోనే తొలిసారిగా 2004లో తీవ్ర అరాచకాలు చేస్తున్న వ్యక్తిపై కోకా యాక్టు అమలు చేసిన చరిత్ర ఆయనకు ఉందని తెలిపారు. రెండో పర్యాయం పోలీస్ కమిషనర్ గా విజయవాడకు చేసిన సందర్భంలో ట్రాఫిక్ లో వినూత్నమైన చర్యలు చేపట్టారని పేర్కొంది.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now