Tirumala : ఈ ఏడాది చివరి వారంలో తిరుమలకు భక్తుల తాకిడి.. నేడు దర్శన సమయం?

తిరుమలలో భక్తుల రద్దీ మళ్లీ పెరిగింది. ఆదివారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది.

Update: 2024-12-22 02:44 GMT

తిరుమలలో భక్తుల రద్దీ మళ్లీ పెరిగింది. ఆదివారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. శనివారం కొద్దిగా తక్కువగా కనిపించినా సాయంత్రానికి భక్తుల సంఖ్య పెరిగింది. అలాగే దర్శనం చేసుకున్న భక్తుల సంఖ్య కూడా పెరిగింది. హుండీ ఆదాయం కూడా పెరగడంతో అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తిరుమలకు శనివారం కొంత భక్తుల తాకిడి తగ్గడంతో ఆదివారం కూడా భక్తుల రద్దీ అంతంత మాత్రంగానే ఉంటుందన్న అధికారుల అంచనా తలకిందులయింది. శనివారం సాయంత్రానికే భక్తులు తిరుమలకు అధిక సంఖ్యలో చేరుకోవడంతో వీధులన్నీ భక్తజన సంద్రంగా మారిపోయాయి. అదే సమయంలో మాడ వీధులన్నీ గోవింద నామ సర్మణలతో మారు మోగిపోతున్నాయి. తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని ఈ ఏడాది చివరి వారం దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. ప్రతి ఏటా డిసెంబరు నెలలో తిరుమలకు భక్తుల సంఖ్య అధికంగా ఉంటుందని, విదేశీ భక్తుల సంఖ్య కూడా అధికంగానే కనిపిస్తుంది. ఇక మండల పూజ కోసం శబరిమల వెళ్లిన అయ్యప్ప స్వాములు కూడా తిరుగు ప్రయాణంలో స్వామి వారిని దర్శించుకుంటున్నారు. అదే సమయంలో తమిళనాడు నుంచి కూడా భక్తులసంఖ్య అధికంగా రావడం మొదలు కావడంతోనే తిరుమల క్యూ లైన్లన్నీ కిటకిటలాడిపోతున్నాయి.

కొత్త ఏడాదికి ముందు...
కొత్త ఏడాదికి ముందు తిరుమల శ్రీవారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకుందామని ఎక్కువ మందిభక్తులు ఈ నెలలో తిరుమలకు చేరుకుంటారు. గతంతో పోలిస్తే హుండీ ఆదాయం కూడా బాగా పెరిగిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని పథ్నాలుగు కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పన్నెండు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. టైమ్ స్లాట్ దర్శనం క్యూ లైన్ లో ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనం రెండు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 72,411 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 27,677 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.44 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.



ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now

 


Tags:    

Similar News