ఏపీ లో ఐఏఎస్ అధికారుల బదిలీలు
ఏపీ ప్రభుత్వం ఐఏఎస్ అధికారుల బదిలీలు చేసింది. పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐఏఎస్ అధికారుల బదిలీలు చేసింది. పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సాంకేతి విద్యాశాఖ డైరెక్టర్ గా ఉన్న పి. భాస్కర్ ను రిలీవ్ చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఆయన స్థానంలో నాగరాణిని నియమించారు. చేనేత శాఖ కమిషనర్ గా ఎం.ఎంన నాయక్ ను నియమించారు. నాయక్ కు ఆప్కో సీఎండీ, ఖాదీ విలేజ్ బోర్డు అదనపు బాధ్యతలను అప్పగించారు.
జగన్ ఆదేశాల మేరకు...
విద్యాశాఖలో కూడా ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల ప్రకారం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కాటమనేని భాస్కర్ ను నియమించారు. క్లీన్ కృష్ణా, గోదావరి కాల్వల కమిషనర్ గా కాటమనేని భాస్కర్ అదనపు బాధ్యతలను నిర్వహిస్తారు. సర్వశిక్ష అభియాన్ డైరెక్టర్ గా బి. శ్రీనివాసరావు నియమితులయ్యారు. రైతు బజార్ల సీఈవోగా ఆయనకు అదనపు బాధ్యతలను అప్పగించారు.