Liqour Shops : మందుబాబులకు బ్యాడ్ న్యూస్ నేటి నుంచి దుకాణాల బంద్

ఆంధ్రప్రదేశ్ లో మందు ప్రియులకు బ్యాడ్ న్యూస్. నేటి నుంచి మద్యం దుకాణాలను బంద్ చేస్తూ సిబ్బంది నిర్ణయం తీసుకున్నారు

Update: 2024-10-01 12:48 GMT

ఆంధ్రప్రదేశ్ లో మందు ప్రియులకు బ్యాడ్ న్యూస్. నేటి నుంచి మద్యం దుకాణాలను బంద్ చేస్తూ సిబ్బంది నిర్ణయం తీసుకున్నారు. దీంతో మద్యం దుకాణాలన్నీ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పాటిస్తున్నాయి. అయితే ఇందుకు కారణం ఇప్పటి వరకూ రాష్ట్రం మద్యం దుకాణాలలో పనిచేసే పదిహేను వేల మంది సమ్మెకు దిగడంతో వైన్ షాపులన్నీ ఏపీలో మూతబడ్డాయి. ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం మద్యం దుకాణాలను సర్కారే నిర్వహించేది. ఇందుకోసం ఎక్సైజ్ సిబ్బందితో పాటు కాంట్రాక్టు కార్మికులను పదిహేను వేల మంది వరకూ నియమించారు. వారు గత నాలుగున్నరేళ్లుగా మద్యం దుకాణాల్లో పనిచేస్తూ తమ పోస్ట్ లు పర్మినెంట్ అవుతాయని భావించారు. కానీ కొత్తగా కూటమి ప్రభుత్వం ఏర్పడటంతో ఏపీలో మద్యం పాలసీని కొత్తది తీసుకు వచ్చింది. దీని ప్రకారం ప్రయివేటు వ్యక్తులు మద్యం దుకాణాలను తీసుకుంటారు.

సిబ్బంది బంద్ చేయడంతో...
ఇది గతంలో టీడీపీ హయాంలో అనుసరించిన విధానమే. అయితే ఈ మద్యం దుకాణాలను నిర్వహించే వారు ప్రయివేటు వ్యక్తులు కావడంతో తక్కువ ధరకు, తమకు ముఖ్యమైన అనుచరులను షాపుల్లో నియమించుకునే అవకాశాలున్నాయి. ఎందుకంటే మద్యం వ్యాపారం రోజు వారీ నగదు లావా దేవీలతో జరిగేది కావడంతో తమకు నమ్మకమైన వారిని నియమించుకుంటారు. దీనికి తోడు అవసరమైన సమయం కంటే ఎక్కువ టైం పనిచేసే వాళ్లను కూడా ఎంపిక చేసుకుంటారు. గత ప్రభుత్వ విధానంలో మద్యం పాలసీ వేరు. కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం విధానం వేరు. దీంతో తమ జీవితాలు వీధిన పడతాయని, తమను ఉద్యోగాల్లో కొనసాగించాలని ప్రభుత్వం ముందు డిమాండ్ పెట్టినా అటు నుంచి రెస్పాన్స్ రాకపోవడంతో నేటి నుంచి వైన్ షాపులను బంద్ చేసి తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఏపీలో మందుబాబులు ఇబ్బంది పడుతున్నారు. ఈ నెల 11వ తేదీన లాటరీ తీసి మద్యం షాపులు కేటాయిస్తారు. అప్పటి వరకూ మందుబాబులకు మద్యం కావాలంటే బార్లకు వెళ్లాల్సిందే. ప్రభుత్వం ఏదైనా చర్చలు జరిపి సిబ్బంది సమ్మె విరమించితేతప్ప మద్యం దుకాణాలను తెరిచే అవకాశం లేదు.


Tags:    

Similar News