పొత్తులపై త్వరగా స్పష్టత ఇవ్వండి
కర్నూలులో రెండో రోజు భారతీయ జనతా పార్టీ పదాధికారుల సమావేశం జరుగుతుంది;
కర్నూలులో రెండో రోజు భారతీయ జనతా పార్టీ పదాధికారుల సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో రాబోయే ఎన్నికల్లో పొత్తులపై ఒక స్పష్టత ఇవ్వాలని నేతలు కొందరు కోరుతున్నారు. పొత్తులపై త్వరగా స్పష్టత వస్తే పార్టీ మరింత క్షేత్రస్థాయిలో బలోపేతం అవుతుందని కొందరు నేతలు సూచించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర నాయకత్వానికి లేఖ రాయాలని కొందరు నేతలు రాష్ట్ర నేతలను కోరారు.
అప్పుడే పార్టీ....
ఇప్పటికే బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో జనసేనతో పొత్తు ఉంది. టీడీపీతో పొత్తు ఉంటుందన్న ప్రచారం ఉంది. అయితే దీనిపై కేంద్ర నాయకత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఎన్నికలకు కొద్దిరోజుల ముందు పొత్తులపై స్పష్టత వస్తే ఇబ్బందులు వస్తాయని, ముందుగానే స్పష్టత ఇస్తే మంచిదని పలువురు నేతలు సూచించారు. మరోవైపు వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు.