BJP : ఎవరినో ముఖ్యమంత్రిని చేయడానికి బీజేపీ సిద్ధంగా లేదు

ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ నాయకుడే ముఖ్యమంత్రి కావాలని ఆ పార్టీ నేత విష్ణువర్థన్ రెడ్డి అన్నారు;

Update: 2024-02-16 11:51 GMT
BJP : ఎవరినో ముఖ్యమంత్రిని చేయడానికి బీజేపీ సిద్ధంగా లేదు
  • whatsapp icon

ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ నాయకుడే ముఖ్యమంత్రి కావాలని ఆ పార్టీ నేత విష్ణువర్థన్ రెడ్డి అన్నారు. వేరే పార్టీ నేతలను ముఖ్యమంత్రి చేయడానికి తాము సిద్ధంగా లేమని ఆయన అన్నారు. ఎవరినో భుజాన వేసుకుని తమ పార్టీ నేతల పనిచేయరని ఆయన అన్నారు. తాము ఎవరి వద్దకో పొత్తుల కోసం వెళ్లలేదని ఆయన గుర్తు చేశారు.

అవతలి వాళ్లే పొత్తుల కోసం...
అవతలి వాళ్లే పొత్తుల కోసం తమ వద్దకు వస్తున్నారంటే తమ బలమేంటో తెలుసే కదా? అని ఆయన ప్రశ్నించారు. గుజరాత్ లో ఒక ఎమ్మెల్యేగా ఉన్న బీజేపీ తర్వాత అధికారంలోకి వచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లోనూ బీజేపీ నేత మాత్రమే ముఖ్యమంత్రి అవ్వాలన్నది తమ పార్టీ నేతల అభిమతమని ఆయన చెప్పారు.


Tags:    

Similar News