Andhra Pradesh : నేడు ఇంటర్ ఫలితాల విడుదల..సులువుగా చూసుకోండిలా
నేడు ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ మొదటి, రెండో సంవత్సర ఫలితాలు విడుదల కానున్నాయి;

నేడు ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ మొదటి, రెండో సంవత్సర ఫలితాలు విడుదల కానున్నాయి. ఉదయం పదకొండు గంటలకు ఫలితాలు విడుదల చేయనున్నట్లు ఉన్నత విద్యామండలి ఇప్పటికే ప్రకటించింది. ఉదయం పదకొండు గంటల తర్వాత resultsbie.ap.gov.in వెబ్ సైట్ తో పాటు మన మిత్రా వాట్సాప్ నెుంబరు9552300009కు హాయ్ అని మెసేజ్ పెట్టినా వెంటనే ఫలితాలు తెలుసుకోవచ్చని అధికారులు తెలిపారు.
పది లక్షలకు మందికిపైగానే...
రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ మీడియట్ మొదటి, ద్వితీయ సంవత్సరాలకు కలిపి 10,17,102 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరంతా పరీక్ష ఫలితాల కోసం ఆసక్తిగా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మరికొద్ది గంటల్లోనే ఫలితాలు వెలువడనుండటంతో తల్లిదండ్రులతో పాటు విద్యార్థుల్లోనూ టెన్షన్ నెలకొంది. అయితే ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు.