చేతకాని ప్రభుత్వం.. అందుకే ఈ సంక్షోభం
రాష్ట్రంలో విద్యుత్తు సంక్షోభానికి ప్రభుత్వం చేతకానితనమే కారణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు.
రాష్ట్రంలో విద్యుత్తు సంక్షోభానికి ప్రభుత్వం చేతకానితనమే కారణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. పదివేల మెగా వాట్ల సౌర విద్యుత్తుకు సబ్సీడీలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించినా రాష్ట్ర ప్రభుత్వం వాడుకోలేకపోయిందన్నారు. అందుకే ఏప్రిల్ నెలలోనే ఏపీలో విద్యుత్తు సంక్షోభం తలెత్తిందన్నారు. ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్న సోము వీర్రాజు మీడియాతో మాట్లాడారు. ఇక పోలవరం గురించి మాట్లాడే హక్కు వైసీపీ ప్రభుత్వానికి లేదన్నారు.
చర్చకు సిద్ధమా?
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన నిధులపై తాము బహిరంగ చర్చకు సిద్ధమని సోము వీర్రాజు సవాల్ విసిరారు. 2024లో ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన అన్నారు. స్పీకర్ తమ్మినేని సీతారాం పై కూడా సోము వీర్రాజు ఫైర్ అయ్యారు. డబ్బు ఇస్తే పాలన చేస్తామని స్పీకర్ అంటున్నారని, కేంద్రం డబ్బులు ఇవ్వకపోతే స్పీకర్ ఆముదాలవలస కు వెళ్లే రోడ్డ ఎలా వచ్చిందని వీర్రాజు ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం చివరకు పంచాయతీ నిధులను కూడా పక్కదోవ పట్టించిందని ఆయన ఆరోపించారు. ఉత్తరాంధ్రలో ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.