నేడు సీబీఐ కోర్టు తీర్పు
మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పిటిషన్ పై నేడు సీబీఐ కోర్టు తీర్పు చెప్పనుంది.;

మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పిటిషన్ పై నేడు సీబీఐ కోర్టు తీర్పు చెప్పనుంది. ఆయన తనను విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కోరిన విజయసాయిరెడ్డి వేసిన పిటీషన్ పై సీబీఐ కోర్టు ఇప్పటికే విచారించింది. ఇరువర్గాల వాదనలు విన్న సీబీఐ కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. వచ్చే నెల పదో తేదీ నుంచి మార్చి పదో తేదీ వరకూ విదేశాలకు వెళ్లనున్నట్లు తెలిపారు.
విదేశాలకు వెళ్లేందుకు...
నెల రోజుల పాటు ఆయన ఫ్రాన్స్, నార్వే దేశాలకు వెళ్లేందుకు అనుమతించాలని విజయసాయిరెడ్డి కోరారు. అయితే దీనిపై సీబీఐ తరుపున న్యాయవాదులు కూడా తమ వాదనలను వినిపించారు. దీనిపై నేడు సీబీఐ కోర్టు తీర్పు వెల్లడించనుంది. ఇటీవలే విజయసాయిరెడ్డి తన రాజ్యసభ పదవికి రాజీనామా చేసి రాజకీయాలకు దూరంగా ఉంటానని, వ్యవసాయం చేసుకుంటానని ప్రకటించిన సంగతి తెలిసిందే.