ఏపీ రాజధాని అమరావతి.. మరోసారి స్పష్టం చేసిన కేంద్రం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మాత్రమేనని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది;
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మాత్రమేనని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. రాజ్యసభలో ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు ఒక ప్రశ్నకు సమాధానంగా ఇచ్చింది. కేంద్రపట్టణాభివృద్ధి సహాయమంత్రి ఈమేరకు రాజ్యసభలో ప్రకటన చేశారు. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటూ కేంద్ర మంత్రి చేసిన ప్రకటనతో మరోసారి స్పష్టం చేసింది.
రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు...
28 రాష్ట్రాల రాజధానులకు మాస్టర్ ప్లాన్ ఉందని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి వెల్లడించారు. తాము ఆ యా రాష్ట్రాలకు సంబంధించిన మాస్టర్ ప్లాన్ ను ఆమోదించినట్లు కూడా కేంద్రం తెలిపింది. దీంతో అమరావతి రాజధానిగా కేంద్ర ప్రభుత్వం గుర్తిస్తూ మరోసారి ప్రకటన చేయడం చర్చనీయాంశమైంది.