Ap Elections : కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరిక.. జూన్ 19వ తేదీ వరకూ అప్రమత్తంగా ఉండాల్సిందే

కేంద్ర ఇంటలిజెన్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది. ఫలితాల తర్వాత అల్లర్లు జరిగే అవకాశముందని తెలిపింది.

Update: 2024-05-17 05:05 GMT

కేంద్ర ఇంటలిజెన్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది. ఏపీలో ఎన్నికల ఫలితాల తర్వాత కూడా అల్లర్లు జరిగే అవకాశముందని తెలిపింది. జూన్ 4వ తేదీన రాష్ట్రంలో ప్రతీకార దాడులకు దిగే అవకాశముందని కేంద్ర ఇంటలిజెన్స్ హెచ్చరించింది. జూన్ 19వ తేదీ వరకూ అప్రమత్తంగా ఉండాలని కోరింది. అదనపు కేంద్ర బలగాలను కూడా సమస్యాత్మక ప్రాంతాల్లో మొహరించాలని తెలిపింది. ప్రధానంగా పల్నాడు, రాయలసీమ ప్రాంతాల్లో మళ్లీ అలర్లు చెలరేగే అవకాశముందని పేర్కొంది.

సాయుధ బలగాలను...
అవసరమైన చోట్ల సాయుధ బలగాలను ముందుగానే మొహరించాలని, కీలక నేతలను ముందుగానే అదుపులోకి తీసుకోవడం మంచిదని కూడా కేంద్ర ఇంటలిజెన్స్ సూచించింది. జిల్లా ఎస్పీ లు నిరంతరం అప్రమత్తంగా ఉండలని పేర్కొంది. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి.. ఘర్షణలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది.
సిట్ ను ఏర్పాటు చేయడానికి...
దీంతో పాటు చీఫ్ సెక్రటరీ కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలతో సిట్ ఏర్పాటుకు సిద్ధమయ్యారు. పోలింగ్ అనంతరం జరిగిన ఘర్షణల విషయంలో విచారణకు సిట్ ను నియమించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ నిన్న ఆదేశించిన నేపథ్యంలో ఆయన ఈరోజు సిట్ ఏర్పాటు చేయనున్నారు. అలర్లపై నమోదయిన ప్రతి కేసును విచారించాలని సీఈసీ పేర్కొనడంతో పాటు ఇప్పటికే నమోదైన ఎఫ్‌ఐఆర్‌లలో అదనపు సెక్షన్లు జోడించాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. తమకు రెండు రోజుల్లో సిట్‌ నివేదిక ఇవ్వాలన్న కేంద్ర ఎన్నికల కమిషన్ కోరడంతో ఈ మేరకు ఆయన ఈరోజు సిట్ ను ఏర్పాటు చేయనున్నారు.


Tags:    

Similar News