YSRCP : నేటి నుంచి వైసీపీ కేంద్ర కార్యాలయం ప్రారంభం

ఈరోజు నుంచే వైసీపీ కేంద్ర కార్యాలయం ప్రారంభమయింది;

Update: 2024-06-10 07:20 GMT
ysrcp, central office, started,  tadepalli, vijayawada
  • whatsapp icon

ఈరోజు నుంచే వైసీపీ కేంద్ర కార్యాలయం ప్రారంభమయింది. తాడేపల్లిలోని జగన్ నివాసంలో ఉన్న సీఎం క్యాంప్ కార్యాలయాన్ని పార్టీ కేంద్ర కార్యాలయంగా మార్చారు. ఈరోజు నుంచి పార్టీ ఆఫీస్ లో కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఈరోజు నుంచి కార్యకర్తలకు నేతలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడ కార్యకర్తలకు అన్యాయం జరిగినా పార్టీ అండగా ఉంటుందని జగన్ భరోసా ఇచ్చారు. తాము అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పిన సంగతి తెలిసిందే.

క్యాడర్ లో...
ఎన్నికలలో ఓటమి తర్వాత క్యాడర్ లో భయం పోగొట్టేందుకు జగన్ తాడేపల్లిలోని తన నివాసంలో పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభిస్తునట్లు తెలిపారు. పదోతేదీ నుంచి నేతలతో పాటు లీగల్ టీం కూడా అందుబాటులో ఉంటుందని చెప్పారు. కార్యకర్తలు వచ్చి తమ అభిప్రాయాలను నేతలకు వివరించే అవకాశాన్ని కల్పించారు. కార్యకర్తల నుంచి ఓటమికి గల కారణాలను తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా పార్టీ కార్యాలయంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.


Tags:    

Similar News