హైకోర్టు తరలింపుపై కేంద్రం ఏమందంటే?

రాష్ట్రం, హైకోర్టు ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాతనే తరలింపుపై కేంద్రానికి ప్రతిపాదనలను పంపాలని కేంద్రం స్పష్టం చేసింది.

Update: 2022-08-04 08:07 GMT

రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాతనే హైకోర్టు తరలింపుపై కేంద్రానికి ప్రతిపాదనలను పంపాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు కలసి హైకోర్టు తరలింపు పై ఉమ్మడి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెప్పింది. హైకోర్టు తరలింపు రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనే ఉంటుందని పేర్కొంది.

నిర్వహణ ఖర్చులు...
హైకోర్టుతో సంప్రందింపులు జరిపిన తర్వాత తమకు ఏ వి‍షయమూ నివేదించాలని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. టీడీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర ప్రభుత్వం ఈ సమాధానం ఇచ్చింది. అయితే హైకోర్టు నిర్వహణ ఖర్చులను మాత్రం రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంటుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.


Tags:    

Similar News