అమరావతిలో ఐకానిక్ టవర్ల నిర్మాణానికి డిజైన్ల కోసం?

రాజధాని అమరావతిలో ఐకానిక్ టవర్ల నిర్మాణాలకు డిజైన్లను రూపొందించేందుకు నార్మన్ సంస్థకు అందచే చేసింది;

Update: 2024-11-26 02:22 GMT

సీఆర్డీఏ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఐకానిక్ టవర్ల నిర్మాణాలకు డిజైన్లను రూపొందించేందుకు నార్మన్ సంస్థకు అందచే చేసింది. రాజధానిలో ఐకానిక్ టవర్ల నిర్మాణానికి 2014 -2019 మధ్య కాలంలో అప్పటి ప్రభుత్వం నార్మన్ పోస్టర్ సంస్థకు డిజైన్లను రూపొందించే బాధ్యతను అప్పగించింది. అయితే గత ప్రభుత్వం మాత్రం టెండర్లను, డిజైన్లను రద్దు చేసింది.

నార్మన్ సంస్థకే ఇస్తూ...
అయితే తాజాగా అదే టెండర్లు, డిజైన్లను నార్మన్ సంస్థకే ఇస్తూ ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దశలవారీగా రుణం చెల్లించేందుకు ప్రపంచ బ్యాంకు సిద్ధంగా ఉందని మంత్రి నారాయణ తెలిపారు. రాజధాని అమరావతిపై పార్లమెంటు స్పష్టం చేసిందని మంత్రి నారాయణ తెలిపారు. కేంద్ర అధికారిక గెజిట్ ను జారీ చేసేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని మంత్రి నారాయణ వెల్లడించారు.


Tags:    

Similar News