50 ఏళ్ల నుంచే పెన్షన్.. చంద్రబాబు సంచలన హామీలు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జయహో బీసీ బహిరంగ సభలో సంచలన హామీలను

Update: 2024-03-05 15:48 GMT

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జయహో బీసీ బహిరంగ సభలో సంచలన హామీలను ఇచ్చారు. బీసీ కులాలకు చెందిన వాళ్లకు 50 ఏళ్ల నుంచే పెన్షన్ ఇస్తామని.. అంతేకాకుండా పెన్షన్ 3000 రూపాయల నుంచి 4000 రూపాయలకే పెంచుతామన్నారు. టీడీపీ-జనసేన ప్రభుత్వంలో బీసీలకు ఐదేళ్లల్లో రూ. 1.50 లక్షల కోట్ల మేర కేటాయింపులు చేస్తామని హామీ ఇచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఇద్దరు పిల్లలే ఉండాలన్న నిబంధనను రద్దు చేస్తామని.. బీసీల కోసం ప్రత్యేక రక్షణ చట్టం తీసుకు వస్తామన్నారు. పీజీ విద్యార్థులకు ఫీజు రీ-ఎంబర్స్‌మెంట్‌ పునరుద్దరిస్తామని తెలిపారు. బీసీల కోసం రూ. 10 లక్షలతో చంద్రన్న బీమా తీసుకొస్తామని అన్నారు. పెళ్లి కానుక తిరిగి ప్రవేశపెడతామని.. ప్రతి ఏడాది కుల ధృవీకరణ తీసుకునే వ్యవస్థలను కూడా రద్దు చేస్తామన్నారు.

స్థానిక సంస్థల్లో 34 శాతం బీసీ రిజర్వేషన్ పునరుద్ధరణ చేస్తామని హామీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు. చట్టసభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్ కోసం తీర్మానం చేస్తామని.. అన్ని సంస్థలు, నామినేటెడ్ పదవుల్లో 34 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని అన్నారు. జనాభా ప్రాతిపదికన కార్పొరేషన్ల ఏర్పాటు ఉంటుందని.. జనాభా దామాషా ప్రకారం నిధుల కేటాయింపు ఉంటుంది. బీసీల స్వయం ఉపాధికి రూ.10 వేల కోట్లు, రూ.5 వేల కోట్లతో 'ఆదరణ' పరికరాలు ఇస్తామని తెలిపారు. బీసీ గురుకులాలను జూనియర్ కాలేజీలుగా అప్ గ్రేడ్ చేస్తామని.. షరతులు లేకుండా విదేశీ విద్యను అందించేలా చూస్తామని అన్నారు. పీజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ పునరుద్ధరణ చేస్తామని హామీ ఇచ్చారు.


Tags:    

Similar News