ఆర్జీవీ కోసం పోలీసుల వెదుకులాట

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కోసం ప్రకాశం జిల్లా పోలీసులు వెదుకుతున్నారు.;

Update: 2024-11-26 04:08 GMT

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కోసం ప్రకాశం జిల్లా పోలీసులు వెదుకుతున్నారు. నిన్న హైదరాబాద్ కు వచ్చిన మద్దిపాడు పోలీసులు ఆయన ఇంట్లో లేకపోవడంతో పాటు సెర్చి వారెంట్ కూడా లేకపోవడంతో వెనుదిరిగారు. అయితే ఆర్జీవీ శంషాబాద్ లోని ఒక ఫామ్ హౌస్ లో ఉన్నారని అనుమానించిన పోలీసులు అక్కడ కూడా వెదికినా ఫలితం లేదు. ఆయన ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా రామ్ గోపాల్ వర్మ కోసం పోలీసులు వెదుకుతున్నారు.

రెండు బృందాలు...
కొన్ని బృందాలు తమిళనాడుకు కూడా వెళ్లాయి. కోయంబత్తూరులో ఉన్నట్లు రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేయడంతో అక్కడకు ఒక బృందం వెళ్లినట్లు తెలిసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ లపై అనుచిత పోస్టులను సోషల్ మీడియాలో పెట్టినందుకు ఆయనపై మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. దీంతో ఆయనను రెండు సార్లు విచారణకు రావాలని కోరినా గైర్హాజరు కావడంతో ఆయన కోసం వెదుకులాటను ప్రారంభించారు.


Tags:    

Similar News