Tirumala : తిరుమలలో మళ్లీ పెరిగిన రద్దీ.. నేడు దర్శన సమయం ఎంతంటే?
తిరుమలలో భక్తుల సంఖ్య ఈరోజు ఎక్కువగా ఉంది. మంగళవారం అయినా భక్తుల రాక తిరుమలకు పెరిగింది
తిరుమలలో భక్తుల సంఖ్య ఈరోజు ఎక్కువగా ఉంది. మంగళవారం అయినా భక్తుల రాక తిరుమలకు పెరిగిపోవడంతో దర్శనానికి ఎక్కువ సమయం పడుతుంది. తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు కంపార్ట్ మెంట్లలో వేచి ఉంటున్నారు. ఉచిత దర్శనం భక్తులకు శ్రీవారి దర్శనం ఎక్కువ సమయం పడుతుంది. చివరి కార్తీక సోమవారం నిన్నటితో ముగియడంతో నేటి నుంచి తిరుమలకు భక్తుల రద్దీ పెరిగిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అభిప్రాయపడుతున్నారు. అయితే భారీ వర్షాలు, వాయుగుండం సూచన కారణంగా ఈ వారంలో భక్తుల సంఖ్య తగ్గే అవకాశముందని కూడా అంచనా వేస్తున్నారు. ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు వాయుగుండం ఏర్పడిందని, ఈ నెల 27 నుంచి భారీ వర్షాలు నమోదవుతాయని, తమిళనాడు, శ్రీలంకలో తీరం దాటే అవకాశముందని తెలిపింది. ఈనేపథ్యంలో తిరుమలలో భారీ వర్షాలు కురుస్తాయని భావించి భక్తులు ఈ వారం కొద్దిగా తగ్గే అవకాశముందని కూడా భావిస్తున్నారు. ఇప్పటికే తమిళనాడు వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి.