Chandrababu Naidu : సీఎం చంద్రబాబు నేటి షెడ్యూల్ ఇదే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు.;
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు. ఉదయం 11.30 గంటలకు చంద్రబాబు నాయుడు సచివాలయానికి రానున్నారు. తర్వాత సచివాలయంలోని ఐదో బ్లాక్ లో జరగనున్న రాజ్యాంగ దినోత్సవంలో చంద్రబాబు నాయుడు పాల్గొంటారని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది.
వివిధ శాఖలపై సమీక్ష...
అనంతరం వివిధ శాఖలపై ఆయన సమీక్ష ను చంద్రబాబు నాయుడు జరపనున్నారు. ఉదయం 12.30 గంటలకు ఐటీ పాలసీపై చంద్రబాబు నాయుడు సమీక్ష చేయనున్నారు. సాయంత్రం ఆరు గంటలకు జీఎస్. డబ్ల్యూ ఎస్ డిపార్ట్ మెంట్ పై సమీక్ష చేస్తారు. ఈ సమీక్ష సమావేశాలకు ఆ యా శాఖలకు చెందిన ఉన్నతాధికారులతో పాటు మంత్రులు కూడా పాల్గొంటారు.