Chandrababu : పొత్తు నేనే ప్రతిపాదించా... పవన్ అందుకు అంగీకరించారు

కలసి పోటీ చేద్దామని పొత్తు కుదుర్చుకుందామని తానే తొలుత ప్రతిపాదించానని పపవన్ కల్యాణ్ తో చెప్పానని చంద్రబాబు తెలిపారు

Update: 2024-10-26 01:54 GMT

 unstoppable with nbk season 4

కలసి పోటీ చేద్దామని పొత్తు కుదుర్చుకుందామని తానే తొలుత ప్రతిపాదించానని, తర్వాత పవన్ కల్యాణ‌్ అందుకు వెంటనే అంగీకరించారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. అన్‌స్టాపబుల్ షోలో ఆయన బాలయ్య అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. తాను రాజమండ్రి జైలులో ఉన్నప్పుడు పరామర్శించడానికి పవన్ కల్యాణ్ వచ్చారని, ఆ సమయంలో తనను ధైర్యంగా ఉన్నారా? అని పవన్ అడిగారన్నారు. అయితే వెంటనే తాను దేనికీ తాను భయపడనని తెలిపానని చెప్పానని అన్నారు. దీంతో పవన్ నాకు ధైర్యం చెబుతూ తాను అన్నీ గమనిస్తున్నానని, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా ప్రయత్నిస్తానని అన్న వెంటనే అలాంటి సమయంలో అందరం కలసి పోటీ చేద్దామని తాను ప్రతిపాదించానని తెలిపారు. దానికి వెంటనే అంగీకరించిన పవన్ కల్యాణ్ రాజమండ్రి జైలు బయట పొత్తు ప్రకటన చేశారని తెలిపారు. అరెస్టయినా, కాకపోయినా పొత్తు మాత్రం ఈసారి ఖచ్చితంగా కుదిరేది అన్నారు. అయితే తన అరెస్ట్ మరికొంత పొత్తుకు ఉపయోగపడిందని చంద్రబాబు అన్నారు.

అరెస్ట్ తప్పుడు నిర్ణయం...
తన అరెస్ట్ తప్పుడు నిర్ణయమని తెలిపారు.దానిని మర్చిపోలేకపోతున్నామని తెలిపారు. తాను నిప్పులా బతికానని, తప్పకుండా ప్రజలు మద్దతిస్తారనే విశ్వాసంతో ఉన్నానని, ఆ నమ్మకమే మళ్లీ తనను ఈ రకంగా గెలిపించిందని చంద్రబాబు తెలిపారు. తాను ఎప్పుడూ రాజకీయ కక్షతో ఎవరితోనూ వ్యవహరించలేదన్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పూర్తి సంయమనంతో ఉంటానని తెలిపారు. అయితే నేడు ఏపీలో తొలిసారి కక్ష పూరిత రాజకీయాలు వచ్చాయని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అయినా సరే తాను మాత్రం తప్పు చేయనని, ఎదుటి వారిపై కక్ష సాధించనని, అలాగని తప్పు చేసిన వారిని వదిలిపెట్టనని కూడా చంద్రబాబు పరోక్ష హెచ్చరికలు చేశారు. తప్పులు చేయని వారి జోలికి వెళ్లనని కూడా చంద్రబాబు తెలిపారు. బాలయ్య అన్‌స్టాపబుల్ షోలో అనేక రకాల ప్రశ్నలకు చంద్రబాబు నవ్వుతూ సమాధానమిచ్చారు. నిన్న రాత్రి ఈ ఎపిసోడ్ ప్రసారమయింది.


Tags:    

Similar News