గత ప్రభుత్వం రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేసింది : చంద్రబాబు
ఈరోజు పవిత్ర, విశిష్టమైన రోజు అని చంద్రబాబు అన్నారు. భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్దదన్నారు.
ఈరోజు పవిత్ర, విశిష్టమైన రోజు అని చంద్రబాబు అన్నారు. భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్దదన్నారు. భవిష్యత్‌లో ఎదురయ్యే సవాళ్లను ఊహించి రాజ్యాంగం రచించారన్న చంద్రబాబు రాజ్యాంగ పరిషత్‌లో తెలుగువాళ్లు ప్రధానపాత్ర పోషించారని తెలిపారు. సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అందరికీ అందాలనేది రాజ్యాంగ లక్ష్యమని తెలిపారు. రాజ్యాంగ స్ఫూర్తిని అందరూ గుర్తుపెట్టుకోవాలని కోరిన చంద్రబాబు ఓటు హక్కు ద్వారా రాజ్యాంగాన్ని కాపాడుకోగలుగుతున్నామని అన్నారు.
గత పాలనలో...
రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేసిన నేతలకు ఓటు ద్వారా ప్రజలు బుద్ధి చెబుతున్నారని చంద్రబాబు అన్నారు. ప్రాథమిక హక్కులను కూడా గతంలో ఎలా కాలరాశారో చూశామన్న చంద్రబాబు, అధికారాన్ని దుర్వినియోగం చేయడం రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందని తెలిపారు. రాజ్యాంగం ఇచ్చిన అధికారాన్ని ప్రజల కోసం ఉపయోగించాలన్న ఆయన ఆర్థిక స్వాతంత్ర్యాన్ని అందరికీ కల్పిస్తే.. సామాజిక న్యాయం జరుగుతుందన్నారు. గత ఐదేళ్లలో వ్యవస్థలన్నీ విధ్వంసానికి గురయ్యాయని, గత ఐదేళ్లలో జీవోలను రహస్యంగా ఉంచారని సీఎం చంద్రబాబు అన్నారు.