Chandrababu : నేడు అమరావతిపై శ్వేతపత్రం విడుదల

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు శ్వేతపత్రాన్ని విడుదల చేయనున్నారు.

Update: 2024-07-03 02:07 GMT

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు శ్వేతపత్రాన్ని విడుదల చేయనున్నారు. గత ఐదేళ్లలో అమరావతి నిర్మాణం జరపకుండా విధ్వంసం సృష్టించిన సంగతిని ప్రజలకు వివరించనున్నారు. అమరావతిపై వాస్తవిక పరిస్థిితిని చంద్రబాబు ప్రజలకు తెలియజేయనున్నారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధానిగా అమరావతిని ప్రకటించి రైతుల నుంచి ముప్ఫయివేల ఎకరాలకు పైగా భూములను సేకరించిన సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేయనున్నారు.

మూడు రాజధానుల పేరిట...
వైసీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే మూడు రాజధానుల పేరు చెప్పి అమరావతిని విధ్వంసం చేసిందని ఆయన చెప్పనున్నారు. గత ఐదేళ్లలో తాము నిర్మించిన భవనాలలో కొన్ని అసంపూర్తిగా ఉన్న వాటిని కూడా పూర్తి చేయలేెకపోయారని, ఎమ్మెల్యే, మంత్రుల క్వార్టర్లు, హైకోర్టు న్యాయమూర్తుల భవనాల నిర్మాణం చేయకుండా అలా వదిలేయడంతో అమరావతి నిర్మాణం ఆగిపోయిందని, దీనివల్ల రాష్ట్రం ఆదాయం కోల్పోయిందని చంద్రబాబు వివరించనున్నారు.


Tags:    

Similar News