Tirumala : నేడు తిరుమల వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అస్సలు వెయిట్ చేయకుండానే

తిరుమలలో భక్తుల రద్దీ బాగా తగ్గింది. బుధవారం కావడంతో భక్తుల రద్దీ తక్కువగా ఉందని భావించాలి;

Update: 2025-01-08 02:53 GMT

తిరుమలలో భక్తుల రద్దీ బాగా తగ్గింది. బుధవారం కావడంతో భక్తుల రద్దీ తక్కువగా ఉందని భావించాలి. ఎల్లుండి నుంచి వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభం కానుండటంతో తిరుమలలో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశముంది. ఎక్కువ మంది వైకుంఠ ద్వార దర్శనానికి వచ్చేందుకు ముందుగానే టిక్కెట్లను బుక్ చేసుకున్నారు. మరో లక్షా ఇరవై వేల టిక్కెట్లు విక్రయిస్తున్నారు. దీంతో ప్రతి నిత్యం భక్తుల రద్దీ ఎక్కువగా ఉండనుంది. ధనుర్మాసంలో ఎక్కువ మంది భక్తులు తిరుమలకు వస్తుంటారు. సంక్రాంతి సెలవులు కూడా వస్తుండటంతో భక్తుల సంఖ్య రానున్న రోజుల్లో ఎక్కువగా ఉంటుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నెల 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకూ జరగనున్న వైకుంఠద్వార దర్శనానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు అధికారులు చేస్తున్నారు. భక్తుల ఇబ్బందులు పడకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తారు. ముఖ్యంగా, వసతి, భోజనం, నీరు వంటి వాటికి ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. అయితే ముందుగా ఈరోజు, రేపు టిక్కెట్లు బుక్ చేసుకున్న వారు మాత్రం తిరుమలకు వచ్చి స్వామి వారిని దర్శించుకుని తమ మొక్కుల చెల్లించుకుంటున్నారు. రేపటి నుంచి కొండ మీదకు వాహనాల రాకపోకల రద్దీ కూడా ఎక్కువగా నుంది. కాలినడకన వచ్చే భక్తుల సంఖ్య కూడా ఎక్కువ కానుండటంతో అందుకు అనుగుణంగా ముందస్తు చర్యలను టీటీడీ అధికారులు తీసుకుంటున్నారు.

హుండీ ఆదాయం...
మామూలుగా బుధవారం తిరుమలలో పెద్దగా రద్దీ ఉండదు. సెలవులు సమీపిస్తుండటంతో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశముండటంతో క్యూ లైన్ లను కూడా పెంచుతున్నారు. ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు ఖాళీగానే ఉన్నాయి. భక్తులు నేరుగా స్వామి వారిని దర్శించుకుంటున్నారు. తిరుమల వీధులన్నీ బోసి పోయి కనిపిస్తున్నాయి. మాడ వీధుల్లో కూడా పెద్దగా భక్తుల సందడి లేదు. అలాగే లడ్డూ కౌంటర్ల వద్ద కూడా భక్తుల హడావిడి లేదు. ఈరోజు ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం ఏడున్నర గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించే భక్తులకు శ్రీవారి దర్శనం ఏడు నుంచి ఎనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ టోకెన్లు కలిగిన భక్తులకు స్వామి వారి దర్శనం మూడు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు గంటలకు పైగా సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 62,566 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వీరిలో 16,021 మంది తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.20 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు వెల్లడించారు.

ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App నౌ



 


Tags:    

Similar News