Ys Jagan : నిరుద్యోగులకు ఏపీ సీఎం జగన్ శుభవార్త
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్ర యువతకు గుడ్ న్యూస్ చెప్పనున్నారు. వేల కోట్ల పెట్టుబడి పెడుతూ సంస్థలు ముందుకు వచ్చాయి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్ర యువతకు నేడు గుడ్ న్యూస్ చెప్పనున్నారు. వేల కోట్ల పెట్టుబడి పెడుతూ ప్రముఖ పారిశ్రామిక సంస్థలు ముందుకు వచ్చాయి. వీటికి నేడు జగన్ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు అధికారులు పూర్తి చేశారు. యువతకు ఉపాధి కల్పించడంతో పాటు భారీ సంస్థలు ఏపీకి రావడంతో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ప్రభుత్వం చెబుతుంది. రాష్ట్రంలో రిలయన్స్, బిర్లా సంస్థలు భారీ పెట్టుబడులకు ముందుకు వచ్చాయి.
ఐదు వేల కోట్లతో...
ఈరోజు వర్చువల్ గా ముఖ్యమంత్రి జగన్ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. 1700 కోట్ల రూపాయలతో ఆదిత్య బిర్లా కార్బన్ మ్యానుఫ్యాక్షర్ ఫెసిలిటీ సంస్థను ఏర్పాటు చేయనుంది. 1024 కోట్ల రూపాయలతో రిలయన్స్ బయోగ్యాస్ ప్లాంట్లు, పలు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను నేడు జగన్ ప్రారంభించనున్నారు. మొత్తం పది కంపెనీలకు సంబంధించి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరగనున్నాయి. వీటితో 4,883 కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయి. 4046 మందికి ఉపాధి అవకాశాలు ఈ పరిశ్రమల ద్వారా లభించనున్నాయి.