Ys Jagan : నేడు "జగనన్న తోడు" నిధుల విడుదల

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నేడు జగనన్న తోడు నిధులను విడుదల చేయనున్నారు. లబ్దిదారుల ఖాతాల్లో నేడు జమ చేస్తారు

Update: 2024-01-11 02:28 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నేడు జగనన్న తోడు నిధులను విడుదల చేయనున్నారు. లబ్దిదారుల ఖాతాల్లో నేడు జమ చేస్తారు. జగనన్న తోడు పథకం కింద ఒక్కొక్కిరికి పదివేల రూపాయల నిధులను విడుదల చేయనున్నారు. ఎనిమిదో విడతగా ఈ రుణాలను జగన్ లబ్దిదారులకు అందించనున్నారు. ఈ విడతలో మొత్తం 3.95 లక్షల మంది లబ్దిదారుల ఖాతాల్లో నగదను జమ చేస్తారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇందుకోసం ప్రభుత్వం 418 కోట్ల రూపాయలను కేటాయించింది.

వడ్డీని కూడా...
దీంతోపాటు వడ్డీ రీఎంబర్స్‌మెంట్ నిధులను కూడా జమ చేస్తారు. దాదాపు 5.81 లక్షల మంది లబ్దిదారులకు 13.64 కోట్ల రూపాయల వడ్డీని ప్రభుత్వం తిరిగి చెల్లించనుంది. పదివేల రూపాయలు లేదా అంతకు పైన పదమూడు వేల రూపాయల వరకూ జగనన్న తోడుపథకం కింద చిరు వ్యాపారులకు వడ్డీలేని రుణాలను అందించాలన్న లక్ష్యంతో ఈ పథకాన్ని రూపొందించిన సంగతి తెలిసిందే. చిరు వ్యాపారులు వడ్డీ వ్యాపారాల బారిన పడకుండా ఆదాయంలో వచ్చిన మొత్తాన్ని రోజువారీ వసూలు చేసే వడ్డీ వ్యాపారులకు చెల్లించకుండా వారి కాళ్ల మీద నిలదొక్కుకునేందుకు ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది.
చిరు వ్యాపారుల కోసం...
ఇప్పటి వరకూ ఏడు విడతలుగా లబ్దిదారులకు జగనన్న తోడు పథకం కింద నిధులను నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో వైఎస్ జగన్ జమ చేస్తున్నారు. దీనివల్ల తమ వ్యాపారాలు చేసుకుంటూ వచ్చిన ఆదాయాన్ని కుటుంబ అభివృద్ధి కోసం ఉపయోగంచుకుంటున్నారు. తమ అవసరాలు తీరడమే కాకుండా తమకు ఈ పథకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చిరు వ్యాపారులు భావిస్తున్నారు. సకాలంలో రుణాలను చెల్లించిన వారికి ఏడాదికి మరో వెయ్యి రూపాయలు కలిపి పదమూడు వేల రూపాయలను ప్రభుత్వం ఇస్తుంది. ఇది తమకు, తమ కుటుంబాన్ని ఆదుకుంటున్న పథకంగా చిరు వ్యాపారులు చెబుతున్నారు. ఈరోజు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ బటన్ నొక్కి లబ్దిదారుల ఖాతాల్లో నగదును జమ చేయనున్నారు.


Tags:    

Similar News