పరవాడ ప్రమాదంపై చంద్రబాబు సీరియస్

పరవాడ ఫార్మాసిటీ ప్రమాదంపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. హైడ్రోక్లోరిక్‌ యాసిడ్‌ లీక్‌తో ఒకరు మృతి చెందారు.;

Update: 2024-11-27 12:27 GMT

AP CM Visit Kadapa district

పరవాడ ఫార్మాసిటీ ప్రమాదంపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. హైడ్రోక్లోరిక్‌ యాసిడ్‌ లీక్‌తో ఒకరు మృతి చెందారు. మరికొందరు తీవ్రగాయపడటంతో ఆసుపత్రికి తరలించారు. పరవాడ ప్రమాదంలో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.

పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని...
పరవాడ ఘటన పై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను కోరారు. అధికారులు, మంత్రులు పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా అధికారులతో ఫోన్‌లో మాట్లాడిన హోంమంత్రి అనిత యాజమాన్య నిర్లక్ష్యం, ప్రమాదానికి కారణాలపై విచారణ జరపాలని కోరారు. దర్యాప్తు అనంతరం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.


Tags:    

Similar News