నేడు కడప జిల్లాకు జగన్

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. ఆయన ఈరోజు ఉదయం 10.30 గంటలకు విమానంలో బయలుదేరతారు

Update: 2021-12-23 02:35 GMT

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. ఆయన ఈరోజు ఉదయం 10.30 గంటలకు విమానంలో బయలుదేరతారు. ఈ నెల 23 నుంచి 25వ తేదీ వరకూ జగన్ కడప జిల్లాలోనే ఉంటారు. వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ీరోజు నేరుగా కడపకు చేరుకున్న తర్వాత ప్రొద్దుటూరుకు చేరుకుంటారు.

ఈరోజు కార్యక్రమాలు...
ప్రొద్దుటూరు మండలం బొల్లవరంలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం బద్వేలు నియోజకవర్గంలోని గోపవరం ప్రాజెక్టు కాలనీకి చేరుకుని అక్కడ ఇటీవల ప్రకటించిన కొత్త రెవెన్యూ డివిజన్ కార్యాలయానికి శంకుస్థాపన చేస్తారు. అక్కడే మెస్సర్స్ సెంచరీప్లై పరిశ్రమకు శంకుస్థాపన చేయనున్నారు. ఈరోజు మధ్యాహ్నం అక్కడి నుంచి కొప్పర్తి గ్రామం చేరకుని అక్కడ జగనన్న మెగా ఇండ్రస్ట్రియల్ హబ్ ఆర్చిని ప్రారంభిస్తారు. సాయంత్రం వైఎస్సార్ ఈఎంసీ ఇండ్రస్ట్రియల్ ఎన్ క్లేవ్ వద్ద స్టాల్స్ ను ప్రారంభిస్తారు. సాయంత్రం ఇడుపుల పాయకు చేరుకుని జగన్ అక్కడే బస చేయనున్నారు.


Tags:    

Similar News