కోస్తా జిల్లాల్లో కంట్రోల్‌ రూమ్‌ల ఏర్పాట్లు.. అలర్టయిన ఏపీ సర్కార్

తుపాను హెచ్చరికతో ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా జిల్లాల్లోని అన్ని కలెక్టరేట్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు

Update: 2024-10-13 13:16 GMT

తుపాను హెచ్చరికతో ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా జిల్లాల్లోని అన్ని కలెక్టరేట్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. భారత వాతావరణ శాఖ చేసిన హెచ్చరికతోఏపీ ప్రభుత్వం అప్రమత్తమయింది. రేపు బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలపడంతో అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తమయ్యారు. ఉద్యోగులకు సెలవులను రద్దు చేశారు. భారీ వర్షాలు కోస్తాంధ్ర, రాయలసీమల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చేసిన హెచ్చరికతో హై అలెర్ట్‌ను ప్రకటించింది.

తుఫాను ఎఫెక్ట్‌తో...
ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అనేక చోట్ల పిడుగులు పడే అవకాశముందని పేర్కొంది. దీంతో ప్రభుత్వం ముందుగానే తుపాను తీవ్రతను తట్టుకునేందుకు అవసరమైన చర్యలు చేపట్టడానికి సిద్ధమయింది. ఇందుకోసం కార్యాచరణను రూపొందించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తూ అవసరమైతే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లను చేసుకుంటోంది. వాహనాలను సిద్ధం చేసింది. పునరావాస కేంద్రాలకు సంబంధించి జిల్లా కలెక్టర్లు అధికారులతో సమీక్ష నిర్వహించారు.


Tags:    

Similar News