ఏపీలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదు.. వైద్యారోగ్యశాఖ ప్రకటన
ఏపీలో కరోనా ఒమిక్రాన్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. తొలి ఒమిక్రాన్ కేసు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ప్రకటించింది.
ఏపీలో కరోనా ఒమిక్రాన్ వేరియంట్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఇప్పటి వరకూ మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదవ్వగా.. తాజాగా ఏపీలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. ఇటీవల ఐర్లాండ్ నుంచి విజయనగరానికి వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్ పాజిటివ్ గా తేలినట్లు వైద్యులు ధృవీకరించారు. గత నెల 27వ తేదీన ఐర్లాండ్ నుంచి ముంబై వచ్చిన 34 ఏళ్ల ప్రయాణికుడి కోవిడ్ ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయగా.. నెగిటివ్ గా తేలింది.
విజయనగరంలో....
ముంబై నుంచి తన స్వస్థలమైన విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలానికి చేరుకున్నాడు. విదేశాల నుంచి రావడంతో అక్కడ మరోమారు కరోనా పరీక్షలు చేయగా.. ఒమిక్రాన్ పాజిటివ్ అని తేలింది. ఏపీలో.. అందులోనూ విజయనగరం జిల్లాలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదవ్వడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ముంబై నుంచి విజయనగరం వచ్చేలోపు అతనిద్వారా ఇంకెతమంది ఒమిక్రాన్ వ్యాప్తి చెంది ఉంటుందోనని భయాందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం అధికారులు బాధితుడిని ఐసోలేషన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.