Tirumala : తిరుమలకు భక్తుల రద్దీ తగ్గడానికి రీజన్?

తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. గురువారం భక్తుల సంఖ్య పెద్దగా లేదు. కంపార్ట్‌మెంట్లన్నీ ఖాళీగానే దర్శనమిస్తున్నాయి

Update: 2024-04-18 02:59 GMT

తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. గురువారం అయినా భక్తుల సంఖ్య పెద్దగా లేదు. తిరుమలలో కంపార్ట్‌మెంట్లన్నీ ఖాళీగానే దర్శనమిస్తున్నాయి. ఎండలకు తిరుమలకు వచ్చేందుకు భక్తులు భయపడిపోతున్నారు. అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో పాటు, వేడిగాలులతో తిరుమలలో భక్తుల రద్దీ కొంత తగ్గిన మాట వాస్తవమేనని అధికారులు చెబుతున్నారు. ముందుగానే బుక్ చేసుకున్న ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన వారు మాత్రం తిరుమలకు చేరుకుంటున్నారు. ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన వారికి స్వామి వారి దర్శనం రెండు గంటల సమయం పడుతుంది.

హుండీ ఆదాయం....
నిన్న తిరుమల శ్రీవారిని 58,690 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వీరిలో 20,744 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.02 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. ఈరోజు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని ఒక కంపార్ట్‌మెంట్లలోనే భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లోకి టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఆరు గంటల సమయం పడుతుంది.


Tags:    

Similar News