Tiruamala : గుడ్ న్యూస్.. శనివారమయినా తిరుమలలో రద్దీ లేదుగా

తిరుమలలో భక్తుల రద్దీ బాగా తగ్గింది. శనివారం అయినా తిరుమలకు తక్కువ సంఖ్యలో భక్తులు వచ్చారు.;

Update: 2025-01-04 02:43 GMT

తిరుమలలో భక్తుల రద్దీ బాగా తగ్గింది. శనివారం అయినా తిరుమలకు తక్కువ సంఖ్యలో భక్తులు వచ్చారు. శని, ఆదివారాలు అత్యధిక సంఖ్యలో తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. కాని ఈశనివారం భక్తుల రద్దీ ఎక్కువగా లేదు. కంపార్ట్ మెంట్లన్నీ ఖాళీ గానే ఉన్నాయి. మరోవైపు శ్రీవారి భక్తులకు జనవరి 10 నుండి 19వ తేదీ వరకు సులభతరంగా వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసేందుకు టీటీడీ ఏర్పాట్లను చేస్తున్నారు. తిరుపతి మరియు తిరుమలలో ఎస్ ఎస్ డి టోకెన్ల జారీ, వైకుంఠ ఏకాదశి పర్వదినాన శ్రీవారి ఆలయంలో కైంకర్యాల నిర్వహణ, భక్తుల భద్రత, దర్శనం, వసతి, పార్కింగ్ సౌకర్యాలు, ట్రాఫిక్ నిర్వహణ, అన్నప్రసాదం మరియు ఇతర ప్రధాన అంశాలపై సుదీర్ఘంగా ఇప్పటికే టీటీడీ అధికారులు చర్చించారు. వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా విచ్చేసి భక్తుల రద్దీ కోసం వివిధ పార్కింగ్ ప్రాంతాలను కేటాయించడం ద్వారా ట్రాఫిక్ నిర్వహణకు ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ పోలీసులతో సమన్వయం చేసుకోనున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో విద్యుత్ అలంకరణలు చేయనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను కూడా అధికారుల పూర్తి చేశారు.

హుండీ ఆదాయం...
మరోవైపు నేడు తిరుమలలో అన్న ప్రసాదాల కాంటిన్ల వద్ద రద్దీని తగ్గించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చిన అందరికీ అన్న ప్రసాదం అందేలా చూడాలని ఇప్పటికే అధికారులు సిబ్బందిని ఆదేశించారు. లడ్డూ కౌంటర్ల వద్ద కూడా అవసరమైతే కౌంటర్ల సంఖ్యను పెంచి ఎక్కువ సమయం లడ్డూల కోసం వేచి చూడకుండాచూడాలని అధికారులను ఆదేశించారు. ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్ మెంట్ లన్నీ ఖాళీగానే ఉన్నాయి. స్వామి వారి చెంతకు నేరుగా దర్శనం చేసుకుంటున్నారు. ఉదయ ఏడు గంటలకు టోకెన్లు లేకుండా సర్వ దర్శనం క్యూ లైన్ లోకి ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఎనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు శ్రీవారిదర్శనం రెండు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 56,550 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వీరిలో 28,853 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.34 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు వెల్లడించారు.


Tags:    

Similar News