YSRCP : ఆలూరులో వైసీపీ లీడర్స్ స్ట్రీట్ ఫైట్
శాసనసభ్యుడు గుమ్మనూరి జయరాం, ఆలూరు వైసీపీ ఇన్‌ఛార్జి విరూపాక్షల మధ్య రగడ రోడ్డుపైకి చేరుకుంది
ఆలూరు నియోజకవర్గంలో వైసీీపీ నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి. మంత్రి, ప్రస్తుత శాసనసభ్యుడు గుమ్మనూరి జయరాం, ఆలూరు వైసీపీ ఇన్‌ఛార్జి విరూపాక్షల మధ్య రగడ రోడ్డుపైకి చేరుకుంది. గుమ్మనూరి జయరాం స్థానంలో వైసీపీ అధినాయకత్వం విరూపాక్షను ఇటీవల పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా నియమించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు గుమ్మనూరి జయరాం దూరంగా ఉంటున్నారు. హళకుంద నుంచి మార్లమాడికి విరూపాక్ష భూమి పూజ చేశారు.
రహదారి నిర్మాణానికి...
అయితే ఈరోజు విరూపాక్ష రహదారి నిర్మాణానికి భూమి పూజ చేశారు. కాంట్రాక్టర్‌ను ఒప్పించి రహదారి పనులను పూర్తి చేసేందుకు ఆయన రోడ్డుకు భూమి పూజ చేశారు. అయితే ఆలూరులో తాను ఎమ్మెల్యేగా ఉండగా విరూపాక్ష భూమిపూజ చేయడమేంటని భావించిన గుమ్మనూరి జయరాం తాను కూడా అదే రోడ్డుకు భూమి పూజ చేస్తానంటూ బయలుదేరారు. దీంతో రెండు వర్గాల మధ్య ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.