నాలుగు లక్షల ఉద్యోగాలపై సభలో గందరగోళం
శాసనమండలిలో అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ సభ్యుల మధ్య వివాదం జరిగింది.;

శాసనమండలిలో అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ సభ్యుల మధ్య వివాదం జరిగింది. వైసీపీ సభ్యురాలు వరుదు కల్యాణి మాట్లాడుతూ నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పించామంటూ గవర్నర్ చేత అబద్ధాలు చెప్పించారని అన్నారు. దీనిపై మంత్రి నారా లోకేశ్ జోక్యం చేసుకుని తాము నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చామని గవర్నర్ ప్రసంగంలో ఎక్కడా చెప్పలేదని, భవిష్యత్ లో నాలుగు లక్షల ఉద్యోగాలు వస్తాయని తాము చెప్పామని లోకేశ్ చెప్పారు.
త్వరలో ఇస్తామని...
ఇప్పటికే అనేక సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని, త్వరలోనే నాలుగు లక్షల ఉద్యోగాలు యువతకు కల్పిస్తామని తెలిపారు. దీనికి వైసీపీ నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ తెలుగులో ప్రింట్ అయిన గవర్నర్ ప్రసంగం లో జరిగిన తప్పులను సరిదిద్దాలని కోరారు. లేకుంటే తప్పుడు సంకేతాలు వెళతాయని బొత్స అన్నారు.