మోదుగుల అరక పట్టి

మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గత మూడేళ్లుగా ఖాళీగానే ఉన్నారు. ఆయనకు ఎటువంటి రాజకీయ పదవులు లభించలేదు;

Update: 2022-06-15 05:49 GMT
మోదుగుల అరక పట్టి
  • whatsapp icon

మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గత మూడేళ్లుగా ఖాళీగానే ఉన్నారు. ఆయనకు ఎటువంటి రాజకీయ పదవులు లభించలేదు. వైసీపీలో కీలకంగా కూడా పెద్దగా వ్యవహరించలేదు. గత ఎన్నికల్లో గుంటూరు పార్లమెంటు నియోజకవర్గం నుంచి వైసీపీ తరుపున పోటీ చేసిన మోదుగుల వేణుగోపాల్ రెడ్డి టీడీపీ అభ్యర్థి గల్లా జయదేవ్ చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే వైసీపీ అధికారంలోకి రావడంతో తనకు ఏదైనా పదవి వస్తుందని ఆశించారు. కానీ జగన్ ప్రభుత్వంలో ఆయనకు ఎలాంటి పదవి లభించలేదు.

ఏరువాక పున్నమి....
దీంతో ఆయన గత కొన్నాళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే తాజాగా ఆయన తన పొలంలో ఏరువాక పున్నమిని నిర్వహించారు. ఏరువాక పున్నమి సందర్భంగా అరక కట్టి స్వయంగా పొలం దున్నారు. ఈ సందర్భంగా తన పొలంలో మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజకీయాల్లో క్రియాశీలకంగా లేని ఆయన తన పొలం పనుల్లోనే ఎక్కువ కాలం గడుపుతున్నారని చెబుతున్నారు.


Tags:    

Similar News