అజ్ఞాతంలోకి పేర్ని నాని కుటుంబం

మాజీ మంత్రి పేర్నినాని కుటుంబ సభ్యులు పోలీసులకు అందుబాటులో లేకుండా పోయారు

Update: 2024-12-13 05:51 GMT

perni nani

మాజీ మంత్రి పేర్నినాని కుటుంబ సభ్యులు పోలీసులకు అందుబాటులో లేకుండా పోయారు. నాని భార్య జయసుధపై కేసు నమోదుకావడంతో కుటుంబ సభ్యులు మచిలీపట్నంలో లేరు. పౌరసరఫరాల శాఖకు చెందిన బియ్యం విషయంలో పేర్ని నాని భార్య జయసుధపై కేసు నమోదయిన నేపథ్యంలో ఆమె మచిలీపట్నం జిల్లా కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.

రేషన్ బియ్యం కేసుతో...
మచిలీపట్నంలో ఉన్న తమ గోదాములో నిల్వ ఉంచిన రేషన్ బియ్యం తగ్గడంతో నాని భార్యతో పాటు నాని పీఏలపై కూడా కేసు నమోదు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా నాని భార్య జయసుధ పేరును చేర్చారు. గత మూడు రోజుల నుంచి పేర్నినాని అందుబాటులో లేరు. అయితే కోర్టులో బెయిల్ వచ్చిన తర్వాతనే ఆయన తిరిగి బయటకు వస్తారని సన్నిహితులు చెబుతున్నారు.


Tags:    

Similar News